జమున మరణం తీరని లోటు : 'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి

జమున మరణం తీరని లోటని మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి అన్నారు. మహా నటులతో కలిసి ఆమె నటించారన్నారు. పుట్టినిల్లు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారని చెప్పారు. మహానటులకు మరణం ఉండదని కొనియాడారు. జమున ఒక లెజెండ్  అన్నారు. అయితే ప్రస్తుతం మా ప్రెసిడెంట్ విష్ణు అందుబాటులో లేరని.. జమున అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేయాలని కోరుతున్నామని చెప్పారు.

మధ్యాహ్నం 2 గంటలకు జమున పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు తరలిస్తారని చెప్పారు. అక్కడే 4 గంటల వరకు జమున భౌతికకాయాన్ని ఉంచుతామన్నారు. ఆ తర్వాత సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జమున కుమార్తె స్రవంతి ఆమె అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.