
స్మిత్ రనౌట్‌పై రవీంద్ర జడేజా
సిడ్నీ: థర్డ్ టెస్ట్ రెండో రోజు స్టీవ్ స్మిత్‌ను రనౌట్ చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాను ఎంత గొప్ప ఫీల్డరో మరోసారి ప్రూవ్ చేశాడు. అంతేకాక స్మిత్‌ను రనౌట్ చేసిన విధానం తన బెస్ట్ పెర్ఫామెన్స్ అని, ఆ వీడియోను మళ్లీమళ్లీ చూసుకుంటానని జడ్డూ పేర్కొన్నాడు. చివరి బ్యాట్స్‌మన్ హేజిల్‌వుడ్‌తో కలిసి క్రీజులో ఉన్న స్మిత్.. బ్యాటింగ్‌లో ఒక్కసారిగా జోరు పెంచాడు. ఈ క్రమంలో స్మిత్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఓ బాల్.. స్క్వేర్ లీగ్ వైపు దూసుకెళ్లింది. దీంతో స్మిత్ డబుల్ రన్ కోసం ట్రై చేశాడు. కానీ డీప్ నుంచి మెరుపులా దూసుకొచ్చి బాల్‌ను అందుకున్న జడ్డూ.. డైరెక్ట్ త్రో చేసి స్మిత్‌ను రనౌట్ చేశాడు. మ్యాచ్ అనంతరం ఆ రనౌట్ గురించి జడ్డూ మాట్లాడాడు. ‘ ఈ రనౌట్ నా బెస్ట్ పెర్ఫామెన్స్. అందుకే ఈ వీడియోను మళ్లీమళ్లీ చూసుకుంటా. 30 యార్డ్స్ సర్కిల్ బయట నుంచి డైరెక్ట్ త్రో తో వికెట్లను కొట్టడం అంటే.. ఆ మూమెంట్ చాలా తృప్తినిస్తోంది. మూడు, నాలుగు వికెట్లు సాధించడం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ రనౌట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని జడేజా పేర్కొన్నాడు.
Ravindra Jadeja You're amazing. What an incredible Run out. Steve Smith out with a Outstanding Throw run out by Jadeja. #AUSvINDtest #AUSvIND #AUSvsINDpic.twitter.com/CzDCjUz1bl
— ?Cricket Videos? (@cricket_videos_) January 8, 2021