చార్మినార్, వెలుగు: ప్రభుత్వ దవాఖానాల్లో ప్రారంభించిన ఐవీఎఫ్ సేవలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పేట్ల బురుజు గవర్నమెంట్ దవాఖానలో ముగ్గురు మహిళలకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రజినీ రెడ్డి శుక్రవారం తెలిపారు. గత అక్టోబర్లో సేవలు ప్రారంభించగా, 20 మంది మహిళలు చికిత్స కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు.
వీరిలో శంషాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విజయవంతమైనట్లు వివరించారు.