జూన్ 10న ఇక్సిగో ఐపీఓ

జూన్ 10న ఇక్సిగో ఐపీఓ

న్యూఢిల్లీ: ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ఇక్సిగోను నిర్వహిస్తున్న లీ ట్రావెన్యూస్​ టెక్నాలజీ లిమిటెడ్​ఐపీఓ ఈ నెల 10–12 తేదీల్లో ఉండనుంది. ఇష్యూ ద్వారా రూ.740 కోట్ల వరకు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరను రూ.88 నుంచి రూ.93 మధ్య నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం జూన్ 7న బిడ్‌‌‌‌‌‌‌‌లు ప్రారంభమవుతాయి.  గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో రూ. 120 కోట్ల విలువైన తాజా ఇష్యూ, 6.66 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటుంది. 

ఓఎఫ్​ఎస్​ కింద సైఫ్​ పార్టనర్స్ ఇండియా  లిమిటెడ్, పీక్ ఎక్స్​వీ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్, మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్, ప్లాసిడ్ హోల్డింగ్స్, క్యాటలిస్ట్ ట్రస్టీషిప్ లిమిటెడ్, మాడిసన్ ఇండియా క్యాపిటల్ హెచ్‌‌‌‌‌‌‌‌సీ, అలోక్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్,  రజనీష్ కుమార్ షేర్లను విక్రయించనున్నారు.  తాజా ఇష్యూ ద్వారా వచ్చిన దాంట్లో రూ. 45 కోట్లను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు,  రూ. 26 కోట్లను టెక్నాలజీ అప్​గ్రేడేషన్​కు వినియోగిస్తారు.