క్రీడలతో మానసికోల్లాసం : జే.సత్యనారాయణ

అశ్వారావుపేట, వెలుగు : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని  అగ్రికల్చర్ యూనివర్సిటీ లా డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫెర్స్ డాక్టర్ జే.సత్యనారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో నాలుగు రోజులు పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలోని రాజేంద్రనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పాలెం, వరంగల్, సిద్దిపేట, దోర్నాల, రుద్రూర్, రంగారెడ్డి, అశ్వారావుపేటకు చెందిన11 కళాశాల నుంచి 430 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.

Also Read : ఏపీలోని బూతుల సంస్కృతిని తెలంగాణకు తెచ్చిన్రు : తాతా మధు

ముందుగా మైదానంలో మార్చి ఫాస్ట్ నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఆటలాడాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల పరిశీలకులు డాక్టర్ జి. సురేశ్,  అశ్వారావుపేట కళాశాల డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.