కార్టూనిస్టులకు అవార్డులు ఇవ్వాలి : జె.వెంకటేశ్, శంకర్ మృత్యుంజయ్

కార్టూనిస్టులకు అవార్డులు ఇవ్వాలి : జె.వెంకటేశ్, శంకర్ మృత్యుంజయ్
  • ప్రెస్​ అకాడమీ చైర్మన్​ను కోరిన ప్రముఖ పొలిటికల్​ కార్టూనిస్టులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్​ శ్రీనివాస్​రెడ్డిని హైదరాబాద్​ ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ తరఫున ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్టులు జె.వెంకటేశ్, శంకర్ మృత్యుంజయ్, నర్సిం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కార్టూనిస్టులు వివిధ పత్రికల్లో వేసిన పొలిటికల్ కార్టూన్లతో అకాడమీ తరఫున ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

1983లో కార్టూన్ల ఎగ్జిబిషన్​ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఉత్తమ కార్టూనిస్టులు, జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం బంద్​చేసిన అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని పునరుద్ధరించే దిశగా  ప్రయత్నించాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డి అందుకు సానుకూలంగా స్పందించారు.