
విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025
నటీనటులు : పవీష్ నారాయణన్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాత్యు థామస్, శరత్ కుమార్, రబియా ఖాతూన్
డైరెక్టర్ : ధనుష్
నిర్మాత : కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా
సంగీతం :జివి ప్రకాష్
పలు సినిమల్లో హీరోగా నటించి అలరించిన హీరో ధనుష్ ఈసారి మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించాడు. ఈరోజు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ "జాబిలిమ్మ నీకు అంత కోపమా" థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విశేషాలంటో చూసేద్దాం..
కథ: మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన హీరో ప్రభు(పవీష్ నారాయణ్) చెఫ్ అయ్యి తన వంటల రుచి అందరికీ చూపించి పెద్ద హోటల్ జబ కొట్టి సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓ పార్టీలో అనుకోకుండా నీలా (అనికా సురేంద్రన్)పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీస్తుంది. దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.. కానీ నీలా తండ్రి (శరత్ కుమార్) వీరి పెళ్ళికి ఒప్పకోకపోగా ప్రభు నచ్చలేదంటూ అవమానిస్తాడు.. ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఎవరిలైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.. ఆ తర్వాత ప్రభుకి తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ(ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి సంబంధం వస్తుంది. ప్రభు కూడా ఒకే చెబుతాడు. కానీ ప్రభు పెళ్లి జరిగే సమయానికి నీలా కూడా తన పెళ్లి కార్డుని ప్రభుకు పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి ప్రభు పెళ్లి ప్రీతితో జరిగిందా.. లేక నీలాతో జరిగిందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ వంటి విషయాల్ని హైలెట్ చేస్తూ ఎమోషన్స్ కి తగ్గట్టుగా సీన్స్ రాసుకుని స్టోరీని చక్కగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ధనుష్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫస్టాఫ్ లోని కొన్ని సీన్స్ నీటి యువతని ఆకట్టుకున్నాయి. ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు మధ్య వచ్చ సన్నివేశాలు సాలీడ్ గా ఉన్నాయి. దీంతో ఒక పక్క లవ్ స్టోరీని నడిపిస్తూనే ఫ్రెండ్ షిప్ వాల్యూ చెప్పే ప్రయత్నం దాదాపుగా ఫలించిందని చెప్పవచ్చు.
ALSO READ | ఎన్టీఆర్-నీల్ సినిమా స్టోరీ ఇదేనా.. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్..
ఇంటర్వెల్ సీన్స్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ సెకెండాఫ్ మాత్రం మంచి ఎమోషనల్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా శరత్ కుమార్ ప్రభుల మధ్య సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్, డైలాగులు ఇవన్నీ కూడా ఫర్వాలేదనిపించాయి. తెలుగు ఆడియన్స్ కోసం డబ్బింగ్ పై ప్రతీక శ్రద్ధ చూపారు. దీంతో సినిమా మొత్తం ఎక్కడాకూడా తమిళ్ ఫ్లేవర్ కనిపించదు. ఓవరాల్ గా చూస్తే ట్రైలర్ స్టార్టింగ్ లో ధనుష్ చెప్పినట్లు ఇది చాలా సింపుల్ స్టోరీ అండీ అంటూ చెప్పే డైలాగ్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు: హీరో ధనుష్ కి గతంలో రాయన్ తీసిన అనుభవం ఈ సినిమాకి బాగానే ఉపయోగ పడిందని చెప్పవచు. ముఖ్యంగా నటీనటులను చక్కగా ఉపయోగించుకుంటూ సింపుల్ స్టోరీ ని కూడా అందరికీ నచ్చేలా తీశాడు. కానీ పాటలు, సెకెండాఫ్ లోని కొన్ని సన్నివేశాల మేకింగ్ లో ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది.. ఇక మ్యూజిక్ విషయానికొస్తే ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ అందించిన సంగీతం కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి బీజియం పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు.. దీంతోపాటూ సాంగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఇక ఎడిటింగ్ విభాగం కూడా చక్కగా పని చేసింది. దీంతో దాదాపుగా ల్యాగ్ అనిపించదు. ఇక ఓవరాల్ గా చూస్తే మంచి క్లాసిక్ లవ్ స్టోరీ, క్లీన్ కామెడీ సినిమాని ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్.