JAAT Box Office: వసూళ్లతో దుమ్ములేపుతున్న జాట్.. అక్కడ గోపీచంద్ మలినేని గట్టిగా పాతేశాడు

JAAT Box Office: వసూళ్లతో దుమ్ములేపుతున్న జాట్.. అక్కడ గోపీచంద్ మలినేని గట్టిగా పాతేశాడు

డైరెక్టర్ గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ లేటెస్ట్ మూవీ జాట్ (JAAT). ఈ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా 'జాట్' నిలిచింది.

లేటెస్ట్గా జాట్ మూవీ 7 రోజుల్లో రూ.70.4కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తూ కలెక్షన్స్ వెల్లడించారు. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు రూ.57.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

సన్నీ డియోల్ గత చిత్రాలు గదర్, గదర్ 2సినిమాల తర్వాత జాట్ హయ్యెస్ట్ వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ సక్సెస్ అందుకున్నారు. జాట్ ఇచ్చిన సక్సెస్ తో బాలీవుడ్ మాస్ హీరోలు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ క్రమంలోనే జాట్ నిర్మాతలు మైత్రి మేకర్స్ సెకండ్ పార్ట్ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు.  

ప్రస్తుతం జాట్ రెండోవారం వసూళ్లతో జాట్ బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తోంది. అయితే, ఏప్రిల్ 18న అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వసూళ్లు తగ్గొచ్చని టాక్ మొదలైంది. కానీ, జాట్ ఏ మాత్రం తగ్గేదేలే అనేలా హవా చూపిస్తోంది. కేసరితో జాట్ వసూళ్లకు బ్రేక్ పడుతుందా? లేదా బూస్ట్ తో బ్లాస్ట్ చేసేస్తోందా? అనేది ఆసక్తిగా మారింది. 

►ALSO READ | Odela 2 Review: ‘ఓదెల 2’రివ్యూ.. తమన్నా మైథాలజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఇకపోతే, జాట్ మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ గదర్ 2 సినిమా అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది. ఏకంగా రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే, ఈ మూవీకి (గదర్ 2) గాను రూ.8కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా, జాట్ మూవీకి ఏకంగా ఆరు రేట్లు పెంచేసాడట.