Rohit Sharma: బాబోయ్.. మ్యాచ్కు ముందు ఎంత మాట అనేశాడు.. మరో వివాదంలో రోహిత్ శర్మ..!

Rohit Sharma:  బాబోయ్.. మ్యాచ్కు ముందు ఎంత మాట అనేశాడు.. మరో వివాదంలో రోహిత్ శర్మ..!

రోహిత్ శర్మ చాలా పెద్ద వివాదంలో పడ్డట్లే కనిపిస్తోంది. టీమ్ గురించి, మ్యాచ్ గురించి పర్సనల్ చాట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏంటి ఇంత మాట అనేశాడు.. ఇక యాజమాన్యం ఊరుకుంటుందా.. అనేలా చర్చలు జరుగుతున్నాయి. రోహిత్ పర్ఫామెన్స్ సరిగా లేకపోవడానికి కారణం ఇదేనేమో అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ముంబై కెప్టెన్ గా తొలగించిన నాటి నుంచి రోహిత్ వ్యవహరం ఏ బాలేదు అని కొందరు విమర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో కూడా సరిగ్గా మసలుకోవడం లేదనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే వాళ్ల హావభావాలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ MI మాజీ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచనలనంగా మారాయి. 

ఇవాళ (ఏప్రిల్ 4) లక్నోతో (LSG) మ్యాచ్ ఉండగా.. రోహిత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.  లక్నో మెంటర్ జహీర్ ఖాన్ తో మాట్లాడాడు రోహిత్. ఈ చాటింగ్ లో ‘‘ఏం చేయాలో అది సరిగ్గా చేశా.. కానీ ప్రస్తుతం నేను చేయడానికేం లేదు’’ అని అనేశాడు. అయితే ఇది ఏ కాంటెక్స్ట్ లో.. ఏ విషయంపై చేశారో తెలియదు కానీ.. ముంబై ఇండియన్స్ టీమ్ గురించే రోహిత్ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

లక్నోతో మ్యాచ్ సందర్భంగా అందరి చూపు రోహిత్ పైనే ఉడటం కామన్. ఎందుకంటే హిట్ మ్యాన్ ఆడిన మూడు మ్యాచ్ లలో 0, 8, 13 రన్స్ తో నిరాశ పరిచాడు. దీంతో ముంబైకి మంచి స్టార్ట్ రావడం లేదని భావిస్తున్నారు. ఈ రోజైనా ఆడతాడేమో అని ఫ్యాన్స్.. టీమ్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే తాజా కామెంట్స్ తో రోహిత్ కావాలనే ఆడటం లేదని ట్రోల్స్ నడుస్తున్నాయి. కెప్టెన్ గా తొలగించినందుకే ఇలా ఆడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. మరి రోహిత్ కామెంట్స్ ఏ అంశంపైన అనేది స్పష్టత రావాల్సి ఉంది. లేదంటే ఇది ఎక్కడికో వెళ్లేలా ఉంది.