జబర్దస్త్ కామెడీ షో వల్ల చాలా మంది కమెడియన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చాలా మంది ఫుల్లు ఫేమస్ అయ్యారు. వారిలో వర్ష ఒకరు. జబర్దస్త్ వర్ష(Varsha)గా ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వర్ష. అంతేకాదు ఇమ్మాన్యుయేల్(Emmanuel)తో ప్రేమ వ్యవహారం నడిపి మరింత పాపులర్ అయ్యారు. సుధీర్, రష్మీ రేంజ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఈ జంట. దీంతో ఇమ్మాన్యుయేల్, వర్ష నిజంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే చాలా కాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. ఇమ్మాన్యుయేల్ గానీ, వర్ష గాని ఆ వార్తలపై స్పందించలేదు.
అయితే తాజాగా మొదటిసారి ఈవార్తలపై స్పందించారు వర్ష. ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు.ఇందులో భాగంగా నెటిజన్స్ వేసిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వర్ష. అందులో ఒక నెటిజన్.. ఇమ్మాన్యుయేల్ తో మీరు ప్రేమలో ఉన్నది నిజమేనా? మీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దానికి సమాధానంగా వర్ష స్పందిస్తూ.. ఇమ్మాన్యుయేల్ మీద నాకు మంచి ఒపీనియనే ఉంది. కానీ, పెళ్లి అనేది మా పర్సనల్ విషయం.. దాని గురించి మీకెందుకు. ఒకవేళ జరిగితే చూడండి. అవ్వకపోయినా చూడండి. నాకు మాత్రం అతనిపై మంచి అభిప్రాయం ఉందని చెప్పగలను.. అంటూ క్లారిటీ ఇచ్చింది వర్ష. ప్రస్తుతం వర్ష చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.