జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కార్ యాక్సిడెంట్..

హైదరాబాద్​:  జబర్దస్త్ షో ఫేమ్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ గురువారం కారు ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ కి వెళ్లొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆటో రాంప్రసాద్ ఈరోజు హైదరాబాద్ లోని తుక్కుగూడ పరిసర ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్ కి వెళ్లి వస్తున్నాడు. 

ఈ క్రమంలో తుక్కుగూడ ఔటర్​పై సడన్ గా బ్రేక్ వెయ్యడంతో వెనుకనుంచి వస్తున్న ఆటో రామ్ ప్రసాద్ కారుని డీ కొట్టింది. దీంతో రామ్ ప్రసాద్ కారు ముందుగా వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రామ్ ప్రసాద్ కి కూడా చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. కానీ వాహనాలు మాత్రం పెద్దమొత్తంలోనే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఆటో రామ్ ప్రసాద్ ఈ మధ్య సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో యాక్టింగ్ పై మాత్రమే కాకుండా డైలీగా రైటర్ గా కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే రామ్ ప్రసాద్ ఎక్కువగా జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఆటో పంచులతో ఆడియన్స్ బాగానే అలరించాడు.