
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వారం వారం కొత్త కొత్త కామెడీ స్కిట్స్ తో ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తోంది. అంతేకాదు.. ఎంతో మంది కామెడీ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ షో. అందులో ఒకరు రాకింగ్ రాకేష్. చిన్న పిల్లలతో స్కిట్స్ చేయిస్తూ.. ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించడం మనోడి స్పెషాలిటీ.
తాజాగా ఈ కమెడియన్ ఓ ఇటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన లైఫ్ గురించి, సుజాత తో పెళ్లి, తన వ్యక్తి గత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.. సుజాతకు నాకు పరిచయం ఏర్పడింది ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో. అలా మా జర్నీ మైదలైంది. సుజాతది మా ఊరు పక్కనే. తాను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ పొజిషన్ కు వచ్చింది. తరువాత కొన్నిరోజులకి మణికొండలో మేము ఉండే దగ్గరే సుజాత షిఫ్ట్ అయ్యింది. అప్పటి నుంచి సుజాత మా అమ్మతో కలిసిపోయింది.
మా గురువు గారు రాళ్ల పల్లి మరణం తర్వాత.. నేను ఎక్కువగా ఆయన సమాధి వద్దనే గడిపేవాడినని. ఆ సమయంలో కేవలం సుజాత మాత్రమే నాతో శ్మశానానికి వచ్చేది. అలా మా ఇద్దరి మనసులు కలిశాక.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా పెళ్లి కోసం ఎక్కువ కష్టపడింది కూడా సుజాతనే. తనే వాళ్ల ఇంట్లో వాళ్లని ఒప్పించి.. పెళ్లి పనులన్ని తనే దగ్గరుండి చూసుకుంది.. అంటూ తన పెళ్లినాటి విషయాలను పంచుకున్నారు రాకేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.