‘జబర్దస్త్’ షోతో కమెడియన్‌గా గుర్తింపును తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ‘KCR’ (కేశవ చంద్ర రమావత్) సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘తెలంగాణ తేజం’ సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజైన ట్రైలర్ విజువల్స్, సీన్స్.. అచ్చమైన పల్లెటూరి మట్టివాసన తెలియజేసేలా సాగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికితోడు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మట్టి మనుషుల లోతులను తెలియజేస్తోంది.
Also Read : ఇంస్టాగ్రామ్లో ప్రభాస్ బ్యూటీ హవా
అనన్య హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి అంజి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు గోరేటి వెంకన్నతో పాటు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నారు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్, కృష్ణ బగవాన్, సుజాత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కథ విషయానికి వస్తే..
ఈ ట్రైలర్‌లో కేశవ చంద్ర రమావత్...షార్ట్‌కట్‌లో కేసీఆర్ అని 90'S వెబ్ సిరీస్ చైల్డ్ యాక్టర్ ఆదిత్య చెబుతూ కనిపించాడు. ఛోటా కేసీఆర్ అని ఓ ముసలమ్మ పిలవగానే రాకింగ్ రాకేష్‌ను చూపించారు. ఇక చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, ప్రేమను పెంచుకున్న బావమరదళ్ల ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఊరి కోసం పల్లెను విడిచి కేసీఆర్ సిటీకి ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నది ట్రైలర్ లో ఎమోషనల్‌గా చూపించారు.
ఇక ఊరు పోతుందంటే ఊపిరి పోయినట్లుగా ఉందని.. పల్లెప్రజలకు తమ ఊరితో ఉన్న మమకారాన్ని...ఊరు విడిచివెళ్లాల్సివచ్చినప్పుడు వారు ఎదుర్కొనే బాధను కేసీఆర్ ట్రైలర్‌లో డైరెక్టర్ అంజి ఎమోషనల్ గా చూపించారు. ఇకపోతే ఈ సినిమాలో రాకింగ్ రాకేశ్ హీరో మాత్రమే కాదు..నిర్మాత కూడా.. ఎలాంటి హిట్ అందుకోనున్నాడో చూడాలి మరి.