![బిడ్డని కోల్పోయిన అవినాష్.. సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్](https://static.v6velugu.com/uploads/2024/01/jabardasth-mukku-avinash-emotional-post-about-his-wife-miscarriage_2X0LycbSVN.jpg)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. అవినాష్ గా కంటే ముక్కు అవినాష్ గానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఒకపక్క కామెడీ షోస్ చేస్తూనే.. అడపాదడపా సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇక 2021లో అనుజాతో అవినాష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆతరువాత కొంతకాలానికి అనుజా ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే తమ లైఫ్ లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు అనే ఆనందంలో ఉన్న ఆ జంట అనూహ్యంగా చేదు వార్తను వినాల్సి వచ్చింది. అవినాష్ భార్య అనుజాకి మిస్ క్యారేజ్ అయ్యింది. 7వ నెలలో బిడ్డ తల్లి గర్భంలోనే చనిపోయింది. ఈ విషయాన్నీ అవినాష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
“నా జీవితంలో జరిగిన సంతోషమైన, బాధ అయినా.. మీతోనే పంచుకుంటాను. అలా నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ.. మొదటి సారి ఒక విషాదాన్ని మీతో పంచుకుంటున్నాను. అనుజా నేను అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం చాలా ఎదురు చూసాం. కానీ, కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అనే బాధ్యతతో మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేసాడు అవినాష్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.