యాదాద్రి ఈవో ఆఫీస్ ముట్టడికి జేఏసీ యత్నం

యాదాద్రి  ఈవో ఆఫీస్ ముట్టడికి జేఏసీ యత్నం
  • స్థానికుల వాహనాలు కొండ మీదకు నిషేధించడంపై  నిరసన

యాదాద్రి ఆలయ ఈవో క్యాంప్ ఆఫీస్ ను స్థానికులు ముట్టడించారు. యాదగిరి గుట్ట యూత్ జేఏసీ పేరుతో ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు ఇవాళ క్యాంప్  ఆఫీసు ముట్టడి కోసం కొండపైకి వెళ్లేందుకు యత్నించారు. స్థానికుల వాహనాలను కొండపైకి నిషేధించడాన్ని నిరసిస్తూ ఇవాళ ఈవో క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యాదగిరిగుట్ట యూత్ జేఏసీ' పిలుపునిచ్చింది. 

యాదాద్రి ఆలయాన్ని వందల కోట్ల రూపాయలతో నవీకరించిన తర్వాత కొత్త రకం ఆంక్షలు అమలు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తమ వాహనాలను కొండపైకి అనుమతించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా మూతపడిన ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారన్న ఆనందం.. సంతోషం.. లేకుండా పోయాయని వాపోయారు. ఈవో వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు తమను బలవంతంగా అరెస్టు చేసి తరలించడాన్ని ఖండించారు. కొండ మీదకు తమ వాహనాలు అనుమతించే వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. 

 

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు

విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్ విధించిన అకాడమీ