
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. జీవో నం.317తో రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు సత్వరమే న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని సీసీఎల్‌ఏ ఆఫీస్‌లో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఉద్యోగుల జేఏసీ మీటింగ్ లచ్చిరెడ్డి మాట్లాడారు.
హాస్పిటళ్లలో క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందేలా కొత్త హెల్త్ స్కీంను అమలు చేయాలని కోరారు. కాగా, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, 317 జీవో, హెల్త్ స్కీం అంశాలపై ఇందులో చర్చించారు.