వీఆర్వోలను రెవెన్యూలో సర్దుబాటు చేయాలి : లచ్చిరెడ్డి

వీఆర్వోలను రెవెన్యూలో సర్దుబాటు చేయాలి : లచ్చిరెడ్డి

శామీర్ పేట వెలుగు: వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తే ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం శామీర్ పేట్ తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో వీఆర్వో, పూర్వ వీఆర్వోలు అత్మీయ సమ్మేళనం జరిగింది.  దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,139 మంది వీఆర్వోలను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.  

పే ప్రొటక్షన్ సర్వీస్ ప్రొటెక్షన్​కల్పించాలని, వీఆర్వోలందరినీ ఆప్షన్ పద్ధతిలో రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలన్నారు.  కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సందర్భంగా వీఆర్వో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.