లగచర్ల ఘటనపై  సమగ్ర విచారణ చేయండి : జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ల‌‌గచ‌‌ర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. సోమవారం ఆయన హుస్సేన్ నాయక్ ను కలిశారు. లగచర్లలో దాడి ఘటనకు అసలు సూత్రధారులు వేరే ఉన్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

కానీ, దాడి అధికారులు, రైతులకు మధ్య జరిగినట్టు మార్చారని చెప్పారు. అధికారంలో ఎవరు ఉన్నా.. ప్రభుత్వ అధికారులు, ప్రజలు మాత్రమే శాశ్వతం అన్నారు. ఈ ఘటనలో కొందరు గూండాలు రైతుల ముసుగులో గ్రామస్తులను అధికారులపైకి ఉసిగొల్పి దాడికి పాల్పడ్డారని తెలిపారు.