చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జేఏసీ చైర్మన్ పరమేశ్వర్అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జేఏసీ వైస్‌చైర్మన్ ఆగంరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వర్మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎజెండా కాదని అది ప్రజల ఎజెండా అన్నారు. రెవెన్యూ డివిజన్సాధన ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. చేర్యాల ప్రాంత అస్తిత్వం కోసం 8 ఏళ్లుగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డితోనే సాధ్యమని త్వరలో సీఎం, మంత్రులను కలిసి మెమోరాండం సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్వైస్చైర్మన్జీవన్రెడ్డి, కౌన్సిలర్లు నరేందర్, భాస్కర్ రెడ్డి, మల్లేశం, మార్కెట్ డైరెక్టర్లక్ష్మీనారాయణ, అశోక్, బీరయ్య, యాదగిరి, యాదయ్య, రాజు, సిద్దయ్య, మహేందర్, రాజిరెడ్డి, రాజేందర్, శంకర్, భూమయ్య, నరేశ్, కుమార్, భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.