కేసీఆర్‌‌‌‌ ఫ్యామిలీ పారిపోకుండా చూడాలి

  •     హుస్నాబాద్‌‌‌‌ పోలీసులకు జేఏసీ లీడర్ల ఫిర్యాదు

హుస్నాబాద్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌, మాజీ మంత్రులు కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావుతో పాటు వారి కుటుంబ సభ్యులు ఫారిన్‌‌‌‌ పారిపోకుండా చూడాలని హుస్నాబాద్‌‌‌‌ జేఏసీ నియోజకవర్గ చైర్మన్‌‌‌‌ కవ్వ లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హుస్నాబాద్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌ కుటుంబ సభ్యులు పదేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఫారిన్‌‌‌‌ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి పాస్‌‌‌‌పోర్టులు సీజ్‌‌‌‌ చేసి, విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. వారి ఆస్తులను ప్రజల పరం చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట కోఆర్డినేటర్లు డ్యాగల సారయ్య, మేకల వీరన్న, ప్రొఫెసర్‌‌‌‌ వీరన్ననాయక్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌‌‌‌ పాల్గొన్నారు.