6న బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తం

6న బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తం
  • మాల సంఘాల జేఏసీ హెచ్చరిక

ఖైరతాబాద్, వెలుగు: అంబేద్కర్​పై పార్లమెంటులో అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్​షాను మంత్రిమండలి నుంచి బర్తరఫ్​ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాల సంఘాల జేఏసీ డిమాండ్​ చేసింది. అంబేద్కర్ పై తాను చేసిన వ్యాఖ్యలకుఅమిత్​షా ఇప్పటి వరకూ క్షమాపణ చెప్పలేదని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలంది. ఆయనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 6న రాష్ట్రంలోని బీజేపీ ఆఫీసులన్నింటినీ ముట్టడించాలని దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, బీసీ సంఘాలకు జేఏసీ పిలుపునిచ్చింది. 

లక్షల మందితో బీజేపీ స్టేట్​ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించింది. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు జి.చెన్నయ్య, మందాల భాస్కర్, బూర్గుల వెంకటేశ్వర్లు, మన్నె శ్రీధర్, చెరుకు రాంచందర్​మాట్లాడారు. పార్లమెంటులో అంబేద్కర్​పై అనుచితంగా మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దళిత సమాజాన్ని అమిత్ షా కించపరిచారని విమర్శించారు.  ఆయనపై మోదీ చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. రాజ్యాంగం వల్లే అమిత్​షా కు మంత్రిపదవి దక్కిందన్నారు. ఈ సమావేశంలో గోపోజు రమేశ్, రాజు వస్తాద్, బేరా బాలకిషన్, జంగ శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.​