ఫీజు రీయింబర్స్ మెంట్​ బకాయిలు చెల్లించాలి : జేఏసీ నేతలు

ఫీజు రీయింబర్స్ మెంట్​ బకాయిలు చెల్లించాలి : జేఏసీ నేతలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న స్కాలర్​ షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వామపక్ష విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని యూటీఎఫ్​ భవన్​లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో వారు మాట్లాడారు.  బకాయిలు భారీగా పేరుకుపోతుండడంతో స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారన్నారు.

స్టూడెంట్స్​కు సర్టిఫికెట్స్​ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు వేధిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వి, ఎస్ఎఫ్​ఐ జిల్లా కార్యదర్శి బి. వీరభద్రం, ఏఐఎస్ఎఫ్​ జిల్లా కార్యదర్శి ఫహీం, పీడీఎస్​యూ చంద్రన్న, వర్గా జిల్లా కార్యదర్శి గణేశ్​​తో పాటు విద్యార్థి సంఘాల నేతలు పార్థసారథి, సాయి కుమార్, రాంచరణ్, ఉపేందర్​ పాల్గొన్నారు.