గనుల వేలాన్ని అడ్డుకోవాలి

గనుల వేలాన్ని అడ్డుకోవాలి
  •  కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు కోరారు. హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ రియాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్‌‌‌‌ సెక్రటరీ ఐ.కృష్ణ, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు నీరటి రాజన్న, ఏఐఎఫ్‌‌‌‌టీయూ ప్రెసిడెంట్‌‌‌‌ జి.రాములు, ఇతర లీడర్లు గురువారం గోదావరిఖనిలోని హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గుజరాత్‌‌‌‌లో ఉన్న అన్ని రకాల మినరల్స్‌‌‌‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించినట్టు తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికే అప్పగించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మైనింగ్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లోని గనుల వేలంలో సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనొద్దని కోరారు. బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ అన్ని గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లపై శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఐటీయూ సెక్రటరీ మెండె శ్రీనివాస్‌‌‌‌ పిలుపునిచ్చారు.