ములుగు, వెలుగు : మంత్రి సీతక్కను ములుగు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా సీతక్కను కలిసి బొకే అందజేసి గ్రీటింగ్స్ చెప్పారు.
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వివిధ శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మడుగూరి నాగేశ్వరరావు, జాయింట్ కన్వీనర్ ఏళ్ల మధుసూదన్, కోకన్వీనర్లు అన్నవరం రవికాంత్, గుల్ల గట్టు సంజీవ, సమ్మయ్య, బాబురావు పాల్గొన్నారు.
సీతక్క గెలవడంతో మొక్కులు
కొత్తగూడ/మంగపేట, వెలుగు : సీతక్కగా ములుగు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్ లీడర్లు గుంజేడు ముసలమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లాడి రాజు, వేలుబెల్లికి చెందిన జీపీఎస్ టీచర్ సారయ్య అమ్మవారికి మొక్కులు సమర్పించారు. అలాగే సీతక్క విజయం సాధించడంతో శివసత్తుల మండల శాఖ అధ్యక్షుడు మానుపెళ్లి వేణు ఆధ్వర్యంలో బోరునర్సాపురంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.