ఆసిఫాబాద్/నేరడిగొండ, వెలుగు : సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు. రెబ్బెన మండలంలోని నేషనల్ హైవేపై గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి జేఏసీ నేతలు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తుంటే సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :నాలుగు నెలలుగా జీతాలు ఇస్తలేరు
నేరడిగొండ మండలంలోని 32 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. జీపీ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాచకొండ పోశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.