కంటోన్మెంట్ ​బోర్డు ఎన్నికలు నిర్వహించాలి

కంటోన్మెంట్ ​బోర్డు ఎన్నికలు నిర్వహించాలి
  •     బోర్డు అధ్యక్షుడికి జేఏసీ సభ్యులు విజ్ఞప్తి 

సికింద్రాబాద్, వెలుగు : కంటోన్మెంట్​బోర్డు ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ సభ్యులు కోరారు. సోమవారం బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్వీఎన్  నంజుండేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్, సీఈఓ మధుకర్ నాయక్​ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నేత తేలుకుంట సతీశ్​గుప్తా మాట్లాడుతూ.. చివరిసారిగా 2015 జనవరి 11న బోర్డు ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు.

అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడం కరెక్ట్​కాదన్నారు. అభివృద్ధి జరగాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేంద్రం జోక్యం చేసుకొని వెంటనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని సతీశ్​డిమాండ్ చేశారు. ఆయన వెంట బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జైప్రకాశ్, శ్యాంసన్ రాజు, బీఎన్ శ్రీనివాస్, బొట్టు ప్రభాకర్, సరిత, యాసిన్ తదితరులు ఉన్నారు.