మిలియన్​ మార్చ్​డేను అధికారికంగా నిర్వహించాలి : తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ 

మిలియన్​ మార్చ్​డేను అధికారికంగా నిర్వహించాలి : తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ 

పంజాగుట్ట, వెలుగు: మిలియన్​మార్చ్​డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్​చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జేఏసీ చైర్మన్​యాదగిరి, సభ్యులు కంచర్ల భద్రి , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు మోహన్​ బైరాగి  మీడియాతో మాట్లాడారు.

సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ తిరుగుబాటు జెండా ఎగరేసిన రోజు మార్చి 10 అని, ఆ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. 10న మిలియన్​మార్చ్​డే నిర్వహిస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్​అమరజ్యోతి నుంచి గన్​పార్క్​వరకు ర్యాలీ ఉంటుందని, ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.