దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయండి

దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయండి

దుబ్బాక, వెలుగు: నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ గా ఏర్పాటు చేయాలని  రెవెన్యూ డివిజన్​ జేఏసీ ప్రతినిధులు సోమవారం ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్​ కోసం 2016 నుంచి  ఎదురు చూస్తున్నారని, అన్ని అర్హతలున్న దుబ్బాకను రెవెన్యూ డివిజన్​గా  ఏర్పాటు చేయాలని కోరారు.

3ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ఎంపీ తెలిపారు.  ఎంపీని కలిసిన వారిలో బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు రొట్టె రాజమౌళి, జీడిపల్లి రవి, చింతల కృష్ణ, జేఏసీ సభ్యులు మాడబోయిన శ్రీకాంత్​, రేపాక భాను, చింత సంతోష్​, కడవేర్గు రాజేందర్​ తదితరులు ఉన్నారు.