హైదరాబాద్, వెలుగు: కమిన్స్ ఇండియా లిమిటెడ్ (కమ్మిన్స్) కోసం జెనరేటర్లు తయారు చేసే ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కంపెనీ జాక్సన్ గ్రూప్ తెలంగాణ మార్కెట్కోసం జెనరేటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ జెన్‌సెట్‌లలో సీపీసీబీఐవీ ప్లస్ కంప్లైంట్ కమ్మిన్స్ ఇంజన్లను అమర్చారు. ఈ కమిన్స్ పవర్డ్ జెన్‌సెట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, అత్యుత్తమ ఖర్చు ఆదా, ఉన్నతమైన పర్యావరణ పరిరక్షణను అందిస్తాయి.
లోడ్-టేకింగ్ సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందని కమ్మిన్స్ పవర్- జెనరేషన్ ఇండియా బిజినెస్ లీడర్ మనోజ్ నాయర్ చెప్పారు. రిమోట్ మానిటరింగ్ సిస్టమ్, అధునాతన ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్, ఖచ్చితమైన ఇంధనం స్థాయి సెన్సర్‌ల వంటి ప్రత్యేకతలు వీటి సొంతమని అన్నారు.