IPL 2025: RCB కి అదిరిపోయే వార్త.. గాయపడిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఫిట్

IPL 2025: RCB కి అదిరిపోయే వార్త.. గాయపడిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఫిట్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టులో గాయపడిన ఇద్దరు ఫారెన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్ నెస్ సాధించినట్టు సమాచారం. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని గురువారం (మార్చి 13) అధికారికంగా తెలియసినట్టు వార్తలు వస్తున్నాయి. అతనితో పాటు ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెతేల్ కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న సమయంలో  జోష్ హాజిల్‌వుడ్ పిక్క నొప్పి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు

గబ్బా టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. అతను నాలుగో రోజు కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ ను వదిలి వెళ్ళాడు. కాలు పిక్కలు పట్టేయడంతో అతను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి అతన్ని తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ ఆసీస్ పేసర్ గాయం నుంచి కోలుకొని త్వరలో ఆర్సీబీ జట్టు తరపున ఆడనున్నటు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో హేజిల్‌వుడ్ ను రూ. 12.5 రూపాయలు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుక్కుంది. ఈ ఆసీస్ పేసర్ పై ఆర్సీబీ చాలా ఆశలే పెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్ లకు దూరమైనా మిగిలిన సీజన్ లో ఆడే అవకాశం ఉంది. 

ALSO READ | ఇండియన్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా హోలీ వేడుకలు      

ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ కూడా కోలుకొని బెంగళూరు జట్టులో చేరనున్నాడు. భారత్ తో వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో బెతేల్ హార్మ్ స్ట్రింగ్ గాయంతో ఇబ్బందిపడ్డారు. సిరీస్ మధ్యలోనే వైదొలిగిన బెతేల్.. గాయం నుంచి కోలుకోకపోవడంతో  ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. మెగా ఆక్షన్ లో  జాకబ్ బెతేల్ ను రూ. 2.6 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ వేయగలడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. 

ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:

జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)
ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)
జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)
భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)
లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
రసిఖ్ సలామ్.. రూ.6. కోట్లు (బౌలర్)
కృనాల్ పాండ్యా.. రూ.5.75 కోట్లు (ఆల్ రౌండర్)
టిమ్ డేవిడ్.. రూ.3 కోట్లు (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)
సుయాష్ శర్మ.. రూ.2.60 కోట్లు (బౌలర్)
జాకబ్ బెథెల్.. రూ.2.60 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్లు (బ్యాటర్)    
నువాన్ తుషార.. రూ.1.60 కోట్లు (శ్రీలంక, బౌలర్)
రొమారియో షెపర్డ్.. రూ.1.50 కోట్లు (వెస్టిండీస్, ఆల్ రౌండర్)
స్వప్నిల్ సింగ్.. రూ.50 లక్షలు (ఆల్ రౌండర్)
స్వస్తిక్ చికారా.. రూ.30 లక్షలు (బ్యాటర్)    
మనోజ్ భాండాగే.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
మోహిత్ రతీ.. రూ.30 లక్షలు (బౌలర్)
అభినందన్ సింగ్.. రూ.30 లక్షలు (బౌలర్)
లుంగి ఎంగిడి.. రూ.1 కోటి (దక్షిణాఫ్రికా, బౌలర్)

ఆర్సీబీ రిటైన్ లిస్ట్:

విరాట్ కోహ్లీ.. రూ.21 కోట్లు (బ్యాటర్)
రజత్ పాటిదార్.. రూ.11 కోట్లు (బ్యాటర్)
యశ్ దయాల్.. రూ.5 కోట్లు (బౌలర్)