Jacob Bethell: RCB బ్యాడ్ లక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ దూరం

Jacob Bethell: RCB బ్యాడ్ లక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ హార్మ్ స్ట్రింగ్ గాయంతో టీమిండియాతో జరగబోయే చివరి వన్డేతో పాటు ఈ నెల 19 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ సోమవారం (ఫిబ్రవరి 10) మీడియాతో బెతేల్ దూరమవ్వడం ఖాయమని చెప్పకనే చెప్పాడు. తొడ కండరాల గాయంతో  భారత్‌తో జరిగిన రెండో వన్డేకు  బెతేల్ దూరమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అద్భుతంగా రాణించిన బెతేల్ దూరమవ్వడంతో ఇంగ్లాండ్ క్రికెట్ అతని స్థానంలో టామ్ బాటన్ ను ఎంపిక చేసింది. 

"బెతేల్ దూరమవ్వడం లోటే. అతను ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోవడం నిరాశకు గురి చేస్తుంది". అని బట్లర్ రెండో వన్డే తర్వాత అన్నాడు. బెతేల్ దూరమయ్యాడని ఇంగ్లాండ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 12 న జరుగుతుంది. 

ALSO READ | IND vs ENG: ఇది కదా రికార్డు అంటే: 73 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన జడేజా

బేతేలు గాయం ఐపీఎల్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కలవరానికి గురి చేస్తుంది. మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 ముందు ఆర్సీబీ బెతేల్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. బెతేల్ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమవుతాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో జాకబ్ బెతేల్ ను రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. బెతేల్ కు ఇదే తొలి ఐపీఎల్.

బేతేలు తో పాటు మరో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న సమయంలో జోష్ హాజిల్‌వుడ్ పిక్క నొప్పి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. హేజల్ వుడ్ ఐపీఎల్ సమయానికి కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.