NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం

NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం

జాతీయ జట్టుకు ఎంపికవ్వడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఎంపికైనా ఈ జనరేషన్ లో మూడు ఫార్మాట్ లు ఆడడం అత్యంత కష్టం. ప్రస్తుత క్రికెటర్లలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్న ప్లేయర్లను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అయితే ఇంగ్లాండ్ యువ క్రికెటర్  జాకబ్ బెథెల్ మాత్రం క్రికెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ లలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఒక ప్లేయర్ ఇంత ఫాస్ట్ గా మూడు ఫార్మాట్ లు ఆడడం ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ కే చెల్లింది. 

సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాపై వన్డే, టీ20 ఫార్మాట్ లలో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ళ క్రికెటర్.. టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 28 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం (నవంబర్ 28) నుంచి హేగ్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ కు ప్రారంభానికి ముందు ట్రోఫీకి కొత్త ట్రోఫీని ప్రకటించారు. ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ కి ఎంపికైన బెథెల్.. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.  

ALSO READ | IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కి గిల్ దూరం.. అడిలైడ్ టెస్టుకు డౌట్

ఇంగ్లాండ్ ప్రకటించిన ప్లేయింగ్ 11 లో బెథెల్ కు చోటు దక్కింది. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని స్టోక్స్ తెలిపాడు. దీంతో మూడు ఫార్మాట్ లలో అరంగేట్రం చేయబోతున్న ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలవబోతున్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో  బెథెల్ ను రూ. 2.6 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. పవర్ హిట్టింగ్ తో పాటు స్పిన్ కూడా వేయగల ఈ యువ ప్లేయర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)