IPL 2025: RCB స్టార్ ప్లేయర్లకు గాయాలు.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. ఐపీఎల్‌కు డౌట్!

IPL 2025: RCB స్టార్ ప్లేయర్లకు గాయాలు.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. ఐపీఎల్‌కు డౌట్!

ఐపీఎల్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 ముందు ఆ జట్టు ఇద్దరు ఫారెన్ ఆటగాళ్ల సేవలను కోల్పోయే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ తో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ గాయాలతో బాధపడుతున్నారు. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న సమయంలో  జోష్ హాజిల్‌వుడ్ పిక్క నొప్పి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. హేజల్ వుడ్ ఐపీఎల్ సమయానికి కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.

ALSO READ | IND vs ENG: సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్

మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ హార్మ్ స్ట్రింగ్ గాయంతో ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎలాంటి అప్ డేట్ లేదు. వస్తున్న సమాచార ప్రకారం అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానంగా మారింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉంది. బెతేల్ స్థానంలో టామ్ బాంటన్ ను ఇంగ్లాండ్ ఎంపిక చేసింది. హేజల్ వుడ్, బెతేల్ ఆర్సీబీకి కీలక ప్లేయర్లు. వీళ్ళిద్దరూ దూరమైతే ఆ జట్టుకు టైటిల్ గెలవడం కష్టంగా మారుతుంది. 

ALSO READ | Champions Trophy 2025: ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడిస్తాం: వెటరన్ క్రికెటర్

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో హేజల్ వుడ్ ను రూ.11 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేయగా.. జాకబ్ బెతేల్ ను రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. గతంలో హేజల్ వుడ్ ఆర్సీబీ జట్టుకు ఆడగా.. బెతేల్ కు ఇదే తొలి ఐపీఎల్. 2025 మెగా ఆక్షన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది.జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్),ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్),జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్),భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్),లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్) టాప్ లిస్ట్ లో ఉన్నారు.