టీచర్ల సమస్యలపై ఉద్యమిస్తమన్న జాక్టో స్టీరింగ్ కమిటీ

హైదరాబాద్, వెలుగు: కొత్త పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ యూనియన్స్ (జాక్టో) డిమాండ్ చేసింది. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఉద్యమం చేపడ్తమని వెల్లడించింది. సోమవారం ఎస్టీయూ భవన్​లో జాక్టో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాక్టో నేతలు సదానందం గౌడ్, కృష్ణుడు మాట్లాడుతూ... టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల కోర్టు వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.  పెండింగ్​లో ఉన్న పండిట్, పీఈటీల అప్​గ్రేడేషన్​ ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. ఈహెచ్ఎస్​ ను నూతన విధివిధానాలతో త్వరితగతిన అమలు చేయాలని తెలిపారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించాలని, జీవో 317తో నష్టపోయిన టీచర్ల అప్పీల్స్​ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాక్టో నేతలు మట్టపల్లి రాధాకృష్ణ, చైతన్య, హేమచంద్రుడు, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ:హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ప్రపంచంలోనే..7వ పెద్ద బ్యాంక్