
- మున్ననూరు గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
మిడ్జిల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దోనూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భూమి పూజ చేశారు. మున్ననూరు గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదన్నారు. ప్రతి గ్రామానికి, తండాలకు బీటీ రోడ్డుతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రబ్బాని, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, మిడ్జిల్ మాజీ ఎంపీటీసీ గౌస్, మల్లికార్జున్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంగారయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.