గ్రామాలను అభివృద్ధి చేస్తాం

బాలానగర్, వెలుగు: నియోజకవర్గాల్లోని గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని నందారం, నేరెళ్లపల్లి, గౌతాపూర్  గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్  సబ్ స్టేషన్లతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్  హయాంలో గ్రామాలను పట్టించుకోలేదని విమర్శించారు. 

తమ ప్రభుత్వం రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. అనంతరం గంగాధర్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్  సెంటర్ ను ప్రారంభించారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.