భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా జరుగుతుంది. మొదట ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలి శుభారంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ తొలి 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 రన్ రేట్ తో ఏకంగా 53 పరుగులు చేసింది. బజ్ బాల్ రుచి టీమిండియాకు చూపిస్తూ అద్భుతంగా ఆడారు. అయితే ఈ దశలోనే మన స్పిన్నర్లు చెలరేగారు. వరుసపెట్టి వికెట్లు తీయడం మొదలుపెట్టారు.
అశ్విన్ 55 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్ ను ఎల్బీడబ్ల్యూ గా ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు.ఆ తర్వాత 15 ఓవర్లో పోప్ ను జడేజా పెవిలియన్ కు చేర్చాడు. ఇక 16 ఓవర్ తొలి బంతికి అశ్విన్ మరో వికెట్ తీసుకున్నాడు. వికెట్ల ముందుకు వచ్చి ఆడిన క్రాలి కవర్స్ లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఒకదశలో వికెట్లేమీ కోల్పోకుండా 55 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ అనూహ్యంగా 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి 60/3 గా నిలిచింది.
బెన్ డకెట్ 7 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ క్రాలి 20 పరుగులు చేయగా..పోప్ ఒక పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ లభించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (7), బెయిర్ స్టో(15) ఉన్నారు.
55 for 0 to 60 for 3....!!!!
— Johns. (@CricCrazyJohns) January 25, 2024
What a comeback by Ashwin & Jadeja. pic.twitter.com/rbPL68VG7a