హైదరాబాద్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ పై భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు ముగిసేసరికి ఏకంగా 175 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ రోజు రాహుల్, జడేజా భారీ హాఫ్ సెంచరీలు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ భరత్, శ్రేయాస్ అయ్యర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజ్ లో ఆల్ రౌండర్లు జడేజా (81) అక్షర్ పటేల్ (35) ఉన్నారు.
టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసిన రోహిత్ సేన చివరి సెషన్ లో మరో 112 పరుగులు జోడించింది. ఈ క్రమంలో జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భరత్, అశ్విన్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్, జడేజా కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ హార్ట్లీ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రెహన్ అహ్మద్, జాక్ లీచ్ కు తలో వికెట్ లభించింది.
లంచ్ తర్వాత అయ్యర్ వికెట్ ను భారత్ త్వరగానే కోల్పోయింది. 35 పరుగులు చేసిన అయ్యర్ రెహన్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో రాహుల్, అయ్యర్ 64 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ దశలో జడేజాతో జత కలిసిన రాహుల్ భారత్ కు ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. ఐదో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత క్రీజ్ లో కుదురుకున్న రాహుల్ 86 పరుగుల చేసి స్పిన్నర్ హార్ట్లీ ఔట్ చేశాడు.
రెండో రోజు ప్రారంభంలో భారత్ జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. పార్ట్ టైం బౌలర్ రూట్ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ తో కలిసి గిల్ 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఉన్నంత సేపు ఆచితూచి బ్యాటింగ్ చేసిన గిల్.. 23 పరుగుల వద్ద హార్ట్లీ బౌలింగ్ లో ఔటయ్యాడు.
అంతకముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 రన్స్‌కు ఆలౌటైంది. హిట్ పెయిర్ అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను తిప్పేశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ఒక్కడే ఫిఫ్టీతో సత్తా చాటాడు. జానీ బెయిర్ స్టో (37), బెన్ డకెట్ (35) ఫర్వాలేదనిపించారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
India vs England, 1st Test#INDvENG #TeamIndia @IDFCFIRSTBank
— Crickskills (@priyansh1604) January 26, 2024
?DAY 2 STUMPS?
England ???????:-2️⃣4️⃣6️⃣ALLOUT
INDIA ??:-4️⃣2️⃣1️⃣/7️⃣ (110 overs)
Ravindra jadeja-81*(155)
Axar Patel-35*(62)
INDIA ?? LEAD BY 1️⃣7️⃣5️⃣ RUNS pic.twitter.com/0LeA2mc3Bq