IND vs NZ 3rd Test: మిచెల్ పైనే భారం.. న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టిన జడేజా

IND vs NZ 3rd Test: మిచెల్ పైనే భారం.. న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టిన జడేజా

ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ముందడుగులో ఉంది. తొలి రోజు రెండో సెషన్ లో మూడు వికెట్లు పడగొట్టి కివీస్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసే ప్రయత్నాలు చేస్తుంది. టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (53), ఇష్ సోధి (1) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్ టన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ లభించింది.  

3 వికెట్ల నష్టానికి 92 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. మిచెల్, యంగ్ చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. సమర్ధవంతగా భారత స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. దీంతో వీరి జోడీ విడదీయడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ క్రమంలో యంగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. 71 పరుగులు చేసిన యంగ్ ను ఒక అద్భుత బంతితో ఔట్ చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

Also Read :- వ్యక్తిగత రికార్డ్‌ల కోసం ఆడేవారు అవసరం లేదు

ఇదే ఊపులో జడేజా ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్లండెల్ ను బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 5 వికెట్లకు 159 పరుగులతో కష్టాల్లో పడింది. టీ విరామానికి ముందు జడేజా మరోసారి కివీస్ కు ఝలక్ ఇచ్చాడు. ఫిలిప్స్ (17) ను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టాడు. ఈ సెషన్ లో జడేజా మూడు వికెట్లు తీసుకుంటే.. మిచెల్ హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేశాడు.