వారే వా జడేజా: గుజరాతీ ఆటగాడు.. గుజరాత్‌లో ఆడి.. చెన్నైని గెలిపించాడు

వారే వా జడేజా: గుజరాతీ ఆటగాడు.. గుజరాత్‌లో ఆడి.. చెన్నైని గెలిపించాడు

గుజరాత్‌పై విజయంతో చెన్నై ఐదో సారి ఐపీఎల్ టైటిల్‌ ఎగరేసుకుపోయిందని అందరికీ తెలుసు. కానీ వారికి ఆ విజయం ఊరికే రాలేదు. ఓటమి ఖాయమన్న సమయంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన సంచలన  బ్యాటింగ్‌తో జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఇది సీఎస్‌కే అభిమానులకు ఆనందాన్ని పంచేదే అయినా, గుజరాత్ ఫ్యాన్స్‌కు మాత్రం మింగుడు పడడం లేదు. 'సొంత రాష్ట్రానికి అన్యాయం చేశావంటూ..' గుజరాత్ అభిమానులు అతన్ని ఆట పట్టిస్తున్నారు. 

జడేజా స్వస్థలం.. గుజరాత్. అతడు జామ్‌నగర్ పరిధిలోని నవగం ఘేడ్‌లో జన్మించాడు. జడేజా భార్య 'రివాభా జడేజా' కూడా ఈమధ్యనే జామ్‌నగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. ఐపీఎల్ టోర్నీ.. ప్రాంచైజీ లీగ్ కావడంతో క్రీడాకారులు తమను కొనుగోలు చేసిన జట్టుకు ఆడటం సహజం. జడేజా కూడా అలానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. 

జడేజా చివరి బంతిని బౌండరీకి మలిచాక.. మైదానంలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువయ్యాయి. అతని భార్య రివాభా జడేజా ఆనందభాష్పాలు ఒలికించగా, ధోని కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లు బయటకి కనపడకపోయినా.. ఆ దృశ్యాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పట్టరాని సంతోషంతో జడ్డూను అమాంతం రెండు చేతులతో ఎత్తుకున్న ధోనీ.. అతన్ని మనసారా హత్తుకున్నాడు. ఆ సమయంలో ధోని కళ్లు చెమర్చాయి.

https://twitter.com/imjadeja/status/1663408403870363648

https://twitter.com/mufaddal_vohra/status/1663364857943724032