గత సర్కార్‌‌‌‌‌‌‌‌లో ఎంపీటీసీలను పట్టించుకోలే : జాడి సుజాత

వెల్గటూర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలకు నిధులు ఇవ్వలేదని, వారిని కనీసం పట్టించుకోలేదని అంబారిపేట ఎంపీటీసీ జాడి సుజాత ఆరోపించారు. వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎంపీటీసీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎంపీపీపై 10 మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి సంతకాలు చేశారని, కానీ నాటి మంత్రి అధికార బలంతో, వెనక్కి తీసుకునేలా చేశారన్నారు.

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వెల్గటూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాసరావుపై బీఆర్ఎస్​లీడర్ల ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సర్పంచ్ గెల్లుశేఖర్, లీడర్లు మురళి గౌడ్, రాజేశం, శ్రీకాంత్ రావు, రమేశ్‌‌‌‌, పాల్గొన్నారు.