
నిర్మల్, వెలుగు: సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామ సమీపంలోని గోదావరి నదిపై చెక్ డ్యామ్ నిర్మించొద్దని ఆ గ్రామ వీడీసీ సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని ఇరిగేషన్ అధికారులకు అందించారు. గత నాలుగేండ్ల నుంచి గోదావరి నది ప్రవాహం కారణంగా తమ గ్రామంలోకి వరద పెద్ద ఎత్తున వస్తోం దని.. ఫలితంగా ఇండ్లు మునిగి, పంటలు నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో చెక్ డ్యామ్ నిర్మాణం చేపడితే తమ గ్రామానికి పూర్తిస్థాయిలో ముంపు ముప్పు ఏర్పడుతుందని, పనులను నిలిపివేయాలని ఆ తీర్మానంలో కోరారు.