మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా చిత్రకూట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ.. తులసీ పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మధ్యాహ్నం చిత్రకూట్ చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో జగద్గురు రామానందాచార్యులు పీఎం మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ALSO READ : దేశంలో ఉల్లి మంటలు : ముందుగానే అలర్ట్ అయిన సర్కార్
అనంతరం తులసి పీఠంలో అష్టాధ్యాయి భాష్య, రామానందాచార్య చరితం, భగవాన్ శ్రీ కృష్ణకి రాష్ట్రలీల అనే మూడు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత తులసి పీఠ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. రామాలయాల్లో ప్రార్థనలు చేయడం తనకు ఆశీర్వాదం అని, జగద్గురువు రామానందాచార్యుల ఆశీస్సులు కోరినట్లు కూడా చెప్పారు. చిత్రకూట్ తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని అన్నారు.
#WATCH | Madhya Pradesh: Prime Minister Narendra Modi seeks blessings of Jagadguru Ramanandacharya of the Tulsi Peeth, in Chitrakoot. pic.twitter.com/kZgLTMZn3q
— ANI (@ANI) October 27, 2023