మంత్రి జగదీష్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఓవైపు భూకబ్జాదారులను ప్రోత్సహిస్తూనే నీతులు చెబుతున్నారని ఆరోపించారు. నా వెనక ఉన్నవాళ్లు తప్పు చేసినా... నాతో ఉన్న వాళ్లు తప్పు చేసినా తాట తీస్తానని గొప్పలు చెప్పిన జగదీష్ రెడ్డి.. కటికం శ్రీనివాసులుపై ఎందుకు కేసు పెట్టలేదని అన్నారు.
సూర్యపేటలో గుంతకండ్ల రాజ్యాంగం నడుస్తోందని.. భజన చేస్తే ఎంతమందిని దోచుకున్నా సహకరిస్తారని విమర్శించారు. సూర్యపేటలో ప్రతి కబ్జాలో మంత్రి జగదీష్ రెడ్డికి వాటా ఉందని.. అందుకే కబ్జాకోరులను కాపాడుతున్నారని సంకినేని అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు.
సూర్యాపేటలో భూకబ్జాలకు వ్యతిరేకంగా, గోస బడుతున్న ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ న్యాయం జరిగే వరకు పోరాడుతుందని సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు.