- ప్రతి రాష్ట్రం నుంచి పిలుపువస్తున్నది
- ప్రజల కోరిక మేరకే బీఆర్ఎస్ ఏర్పాటు
- రాష్ట్రంలో వ్యవసాయం వెల్లివిరుస్తున్నది: మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, వెలుగు: పక్క రాష్ట్రాల రైతులు కూడా తమకు తెలంగాణ లాంటి ప్రభుత్వమే కావాలని, కేసీఆర్ నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను తమ రాష్ట్రానికి రావాలని ప్రతి రాష్ట్రం నుంచి పిలుపు వస్తున్నదని, ప్రత్యేకించి రైతాంగం నుంచి పిలుపువస్తున్నదని ఆయన చెప్పారు. ప్రజల కోరిక మేరకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు.
సూర్యాపేటలో శనివారం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం అద్భుతంగా వెల్లివిరుస్తున్నదని చెప్పారు. ‘‘దండగ అన్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ విధానాలు తమకూ కావాలని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర రైతులు ఎదురుచూస్తున్నరు” అని ఆయన పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల కు కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నించారని దుయ్యబట్టారు.