సూర్యాపేట: కాంగ్రస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాలం తెచ్చిన కరువు కాదు..ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని చెప్పారు. నడిగూడెం మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రైతు పొలాల్లోకి నీళ్లు తెస్తే .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు కళ్ళలో నీళ్ళు తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటల కారణంగా మంత్రి సీతక్కను అడ్డుకున్నారని...
రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ నాయకిడిని ముందు రోజుల్లో ఇలానే అడ్డుకుంటారని అన్నారు.
సాగర్ కాలువపై పోలీసులను కాపలా పెట్టి పాలేరుకు నీళ్లు తరలిస్తుంటే జిల్లా మంత్రులు చేతులు కట్టుకుని చూస్తున్నారని దుయ్యబట్టారు. దున్నపోతులాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రలాంటి కేసీఆర్ మాత్రమే నిద్ర లేపుతాడని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు.. ఈసారి బీఆర్ఎస్ కుమెజార్టీ స్థానాలు కట్టబెట్టాలని కోరారు జగదీష్ రెడ్డి.