తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్​ ఎప్పటికీ విలనే : జగదీశ్​ రెడ్డి

తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్​ ఎప్పటికీ విలనే : జగదీశ్​ రెడ్డి
  • అప్పట్లో తెలంగాణ పేరెత్తితే నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారు: జగదీశ్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆంధ్రాలో కలి పింది కాంగ్రెస్​ పార్టీయేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో తెలం గాణ పేరెత్తితే నక్సలైట్ల పేరు చెప్పి కాల్చి చంపిందన్నారు. కేసీఆర్​ను తిడుతున్న వాళ్లు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద పనిచేశారన్నారు.

 కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ విలన్​గానే ఉంటుందన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు ఆపాలన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు? ఎంత బోనస్​ ఇచ్చారు? చెప్పాలని, లేకపోతే రండలేనని అన్నారు. ఎన్​డీఎస్​ఏ ఇచ్చిన రిపోర్ట్​ నిజమని నిరూపించాలని ఆయన డిమాండ్​ చేశారు.