జ‌‌గ‌‌న్ బెయిల్ ర‌‌ద్దు కేసు మరో బెంచ్​కు బదిలి

జ‌‌గ‌‌న్ బెయిల్ ర‌‌ద్దు కేసు మరో బెంచ్​కు బదిలి

న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ మాజీ సీఎం జగన్మోహ‌‌న్ రెడ్డి బెయిల్‌‌ రద్దు, కేసుల ట్రయల్‌‌ బదిలీ చేయాలనే పిటిష‌‌న్లపై విచార‌‌ణ వాయిదా ప‌‌డింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సమయంలో  సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్పు చేసింది.

 గతంలో విచారించిన జస్టిస్‌‌ అభయ్‌‌ ఎస్‌‌ ఓకా, జస్టిస్‌‌ పంకజ్‌‌ మిత్తల్‌‌ ధర్మాసనం నుంచి, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్‌‌ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. తొలిత సీజేఐ జ‌‌స్టిస్ సంజీవ్ ఖ‌‌న్నా, జ‌‌స్టిస్ సంజ‌‌య్ కుమార్ ధ‌‌ర్మాసనం విచారించ‌‌గా, కేసు విచార‌‌ణ నుంచి జ‌‌స్టిస్ సంజ‌‌య్ కుమార్ త‌‌ప్పుకున్నారు. దీంతో పిటిష‌‌న్‌‌ను జస్టిస్‌‌ అభయ్‌‌ ఎస్‌‌ ఓకా, జస్టిస్‌‌ పంకజ్‌‌ మిత్తల్‌‌ ధర్మాసనానికి మార్చారు.

కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు అడ్వకేట్ కోరారు. అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది కోరారు. వచ్చే సోమవారం విచారణ చేపడుతామని జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ రాకపోతే, తానే వాదనలు వినిపిస్తాన‌‌ని ధ‌‌ర్మాస‌‌నానికి సొలిసిటర్‌‌ జనరల్‌‌ తుషార్‌‌ మెహతా తెలిపారు. దీనికి ధ‌‌ర్మాస‌‌నం అంగీకరించి, కేసు విచార‌‌ణను వాయిదా వేసింది.