నల్లకండువాలతో అసెంబ్లీకి జగన్

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ  సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని, వాటికి నిరసనగా నల్ల కండువాలు ధరించి సభకు హారజరయ్యామని జగన్ తెలిపారు. ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిపారు. 

Also Read :- రంగం భవిష్యవాణి