జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ కేసులను విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ప్రస్తుతం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి జగన్ కేసుల ట్రయల్ విచారణను మారింది. 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. అయితే సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున ఈ కేసుకు సంబంధించి వచ్చే వారానికి వాయిదా వేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో కేసు విచారణను వచ్చే సోమవారం (జనవరి 27) చేపడతామని జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తేల్చింది.
Also Read :- రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట
పదేళ్లుగా కేసు విచారణ కొనసాగుతున్నప్పటికి ఒక్క డిశ్చార్జి అప్లికేషన్కేడా డిస్పోస్ చేయలేదని రఘురామ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలుపుతూ.. ఈ విషయంలో సీబీఐ, నిందితులు ఇద్దరు కుమ్మక్కయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్న ఐదుగురు జడ్జిలు ఎలాంటి నిర్ణయం వెల్లడించకుండానే ట్రాన్సఫర్ అవుతున్నారనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంతవరకు ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్‌పై తుది నిర్ణయం వెలువడకపోవడంతో కుట్రకోణం దాగి ఉందనే సందేహంతో రఘురామ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని.. సుప్రీం కోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్‌లో జాప్యం జరుగుతూనే ఉందని.. కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు.